Home Page Sliderhome page sliderNews

నువ్వా -నేనా …తెలుగు రాష్ట్రాల సీఎంల మాటల యుద్ధం

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి–కృష్ణా జలాల అంశంపై రాజకీయ వాగ్వాదం చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేర్వేరు వేదికలపై పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. వరదను భరించాలి కానీ నీటిని వాడుకుంటే తప్పా – ఏపీ సీఎం విజయవాడలో జెండా ఆవిష్కరణ అనంతరం మాట్లాడిన చంద్రబాబు, బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ద్వారా ఏ రాష్ట్రానికీ నష్టం ఉండదని స్పష్టం చేశారు. సముద్రంలో వృథా అవుతున్న గోదావరి నీటిని మాత్రమే వినియోగించాలనుకుంటున్నామని, ఎగువ రాష్ట్రాల వరదనీటితో ఏపీ నష్టాలు ఎదుర్కొంటోందని చెప్పారు. అలాంటి నీటిని వినియోగించడంలో అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కృష్ణ – గోదావరి జలాలపై రాజీ పడేది లేదు – తెలంగాణ సీఎం హైదరాబాద్‌లో గోల్కొండ కోట వేదికగా ప్రసంగించిన రేవంత్ రెడ్డి, కృష్ణా–గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన శాశ్వత హక్కుల కోసం వ్యూహాత్మకంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా, కుట్రలు చేసినా వాటిని తిప్పికొట్టి, ముందుగా తెలంగాణ అవసరాలు తీర్చుకుని ఆ తర్వాతే ఇతర రాష్ట్రాలకు నీరు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ విధంగా, స్వాతంత్ర్య దినోత్సవ వేళ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటి హక్కుల అంశంపై తమ తమ వాదనలు వినిపించారు.