నిన్న భార్య.. నేడు భర్త..
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో షాపింగ్ మాల్ వద్ద వ్యక్తి డెడ్ బాడీ కలకలం రేపింది. మృతుడు హయత్ నగర్ కు చెందిన నగేష్ గా గుర్తించారు. కుటుంబ కలహాలతో నిన్న ఆయన భార్య శిరీష ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంలో పోలీసులు నగేశ్ ను అదుపులో కి తీసుకొగా.. నిన్న రాత్రి నగేశ్ ను కుటుంబ సభ్యులు జామీన్ పై పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున నగేష్ డెడ్ బాడీ షాషింగ్ మాల్ దగ్గర కనిపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగేష్ ది హత్య లేదా ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఒక్కరోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.