నిన్న ఆపిల్… నేడు మార్బల్…
పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చినందుకు టర్కీ ఆపిల్స్ ను మహరాష్ట్రలోని పుణే వ్యాపారస్తులు బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఉదయపూర్ మార్బల్ ట్రేడర్లు, టర్కీ నుండి రాయిని దిగుమతి చేసుకోవడం నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. ఇండియా – పాకిస్థాన్ మధ్య జరిగిన ఉద్రిక్తత పరిస్థితిల్లో పాకిస్థాన్ కు టర్కీ సహాయం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు. అలాగే వారు ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. తమ నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేసి, టర్కీ మార్బుల్ దిగుమతులపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని కోరారు.


 
							 
							