Home Page SliderNational

కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా యడ్యూరప్ప తనయుడు విజయేంద్ర

బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రకు బీజేపీ హైకమాండ్ దీపావళి కానుకగా ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా శికారిపుర ఎమ్మెల్యే బీవై విజయేంద్రను నియమించారు. విజయేంద్ర నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి నళిన్‌కుమార్‌ కటీల్‌ను తప్పించాలన్న డిమాండ్‌ పార్టీలో నెలకొంది. అధ్యక్ష పదవి రేసులో ఎంపీపీ శోభా కరంద్లాజే, సీటీ రవి పేర్లు వినిపించాయి. కానీ లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బీవై విజయేంద్రకు బీజేపీ హైకమాండ్ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది.