Andhra PradeshHome Page Slider

2019లో వైసీపీ గెలుపు నిజం కాదన్నమాట: యామినీ శర్మ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నిన్న  ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చేసిన ట్వీట్ రాజకీయ దూమారం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై పలువురు నేతలు ఇప్పటికే స్పందించి జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే దీనిపై బీజేపీ నాయకురాలు యామిని శర్మ కూడా స్పందించారు. ఆమె మాట్లాడుతూ..ఈవీఎంలపై వైసీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. గత ఎన్నికల్లో(2019)లో ప్రజలు వైసీపీకి 151 సీట్లు కట్టబెట్టినప్పుడు ఉపయోగించింది ఇవే ఈవీఎంలు అని ఆమె గుర్తుచేశారు. అయితే అప్పుడు మాత్రం వైసీపీ నేతలు ఎవరు కూడా నిషేదం గురించి మాట్లాడలేదన్నారు. దీనికి అర్థం అప్పుడు వైసీపీ విజయం నిజం కాదా? అని ఆమె ప్రశ్నించారు. కాగా ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీ భవిష్యత్తు అంధకారంగా మారిందని యామిని శర్మ వెల్లడించారు.