Andhra PradeshNews

పవన్‌ వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్

జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన వైసీపీ నేతలపై మాటల తూటాలు సంధించారు. ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. వైసీపీ మంత్రి అమర్‌నాథ్ పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ వ్యాఖ్యలతో పవన్ ముసుగు తొలిగిపోయిందన్నారు.  అంతేకాకుండా నువ్వు ప్యాకేజీ స్టార్‌వే అని అమర్‌నాథ్ పవన్‌కళ్యాణ్‌ను విమర్శించారు. పీకే అంటే పెళ్లిల్ల కళ్యాణ్ ,పిచ్చికుక్క అని అన్నారు. పవన్ ఒక పిచ్చికుక్కలా మొరిగారన్నారు. రాష్ట్రంలో మీకు 6 % ఓట్లు వస్తే..మాకు 50% ఓట్లు వచ్చాయన్నారు. ఎవరి దగ్గర ఎక్కువ చెప్పులు ఉంటాయో తెలుసుకదా అని అమర్‌నాథ్ అన్నారు. గాజువాక ,భీమవరం ప్రజలు..ఓట్ల రూపంలో పవన్‌కళ్యాణ్‌ను చెప్పుతో కొట్టారన్నారు. కులంపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని ప్రజలందరూ విన్నారన్నారు. పవన్‌కు కాపులు ఇప్పుడే గుర్తుకు వచ్చారా? అని అమర్‌నాథ్ ప్రశ్నించారు. పవన్‌ను నడిపించేది కమ్మజన సేనేనని అమర్‌నాథ్ ఆరోపించారు.