Andhra PradeshHome Page SliderPolitics

ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ కీలక నిర్ణయం

తూతూ మంత్రంగా జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేయట్లేదని వైసీపీ నేత పేర్ని నాని తెలియజేశారు. ఉభయగోదావరి జిల్లాలలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికలలో వైసీపీ పోటీ చేయట్లేదన్నారు. ఈ ప్రభుత్వం కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తూ నడుపుతున్న ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దేశంలోనే దయనీయ స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరపాలనే ప్లాన్‌లో ప్రభుత్వం ఉందన్నారు.