YCP చేష్టలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది: లోకేష్
అమరావతి: ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితి నెలకొందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందని మండిపడ్డారు. ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కాకినాడలో అర్చకులపై వైకాపా నేత దాడి ఘటనపై లోకేష్ స్పందించారు. కాకినాడ శివాలయంలో పూజ సరిగా చేయలేదని గర్భగుడిలో అర్చకులపై వైసీపీ నేత సిరియాల చంద్రరావు దాడి చేయడం జరిగింది. భగవంతుడి సేవ తప్ప మరో ధ్యాసలేని అర్చకులపై ప్రతాపమా? పూజారులపై దాడి చేసిన వైసీపీ నేతను తక్షణమే శిక్షించాలి. మరో రెండు నెలల్లో ప్రజా ప్రభుత్వం రాబోతోంది. ఈలోగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీసులకు విన్నవిస్తున్నా అని లోకేష్ అన్నారు.

