“వైసీపీ హార్బర్ల టెండర్లలో గోల్‌మాల్ చేసింది”: మంత్రి అచ్చెన్న
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా ఏపీలో వైసీపీ హయాంలో 5 హార్బర్ల టెండర్లను సొంతవారికే కట్టబెట్టారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ సానుభూతిపరులకు మత్స్యకార భృతి కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. అయితే ఏపీలో టీడీపీ హయాంలో అమలు కానున్న మత్స్యకార భృతిపై 20 రోజుల్లో నివేదిక తయారు చేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మత్స్యకారుల డీజిల్ సబ్సీడీపై రూ.10 కోట్లు బకాయి ఉందన్నారు. కాగా వాటిని త్వరలోనే చెల్లిస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఏపీలో మత్స్యకారుల పరిస్థితి చూస్తుంటే బాధేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు వాపోయారు.