Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsPoliticsTrending Todayviral

మంత్రి అచ్చెన్నాయుడినీ ప్రశ్నిస్తున్న వైసీపీ సోషల్ మీడియా

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. ఒకప్పుడు మాదిరిగా పత్రికల ద్వారా కాకుండా, ఇప్పుడు పార్టీలు తమ ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలు సోషల్ మీడియా పోస్టుల రూపంలో చేస్తుండటం విశేషం. తాజాగా ట్రూత్ బాంబ్ పేరిట వైసీపీ మరోసారి తెలుగుదేశం మంత్రి అచ్చెన్నాయుడుపై ఆరోపణలు గుప్పించింది.వైసీపీ సోషల్ మీడియా విభాగం తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం, అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ జనరల్ మేనేజర్ రాజమోహన్ పై ఒత్తిడి తెచ్చి అవినీతి పనులకు పాల్పడాలని ప్రయత్నించినట్టు ఆరోపించింది. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని మంత్రిపేషి నుంచి వచ్చిన ఒత్తిడిని రాజమోహన్ తిరస్కరించడంతో, అతడిని నెల్లూరు జిల్లాకు బదిలీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇంకా ఓ అడుగు ముందుకేసిన వైసీపీ, రాజమోహన్ స్థానంలో అర్హతలు లేని, పెండింగ్ కేసులు ఉన్న జూనియర్ అధికారిని నియమించారని ఆరోపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజమోహన్ సెలవుపై వెళ్లేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారని వైసీపీ పేర్కొంది.“ఇదేనా మీ మంచి ప్రభుత్వం? ఇదేనా మీరు చెప్పే పారదర్శక పాలన?” అని వైసీపీ సోషల్ మీడియా వేదికగా టిడిపిని ప్రశ్నించింది.ఇంతకుముందు ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహారాన్ని కూడా ట్రూత్ బాంబ్ పేరిట బయటపెట్టిన వైసీపీ, ఇప్పుడు అచ్చెన్నాయుడిపై దృష్టి కేంద్రీకరించింది.ఇదిలా ఉండగా, ఈ ఆరోపణలపై టిడిపి అధికారికంగా స్పందించాల్సి ఉన్నప్పటికీ, టిడిపి అనుకూల నెటిజన్లు మాత్రం వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.“మీ హయాంలో అవినీతి తారాస్థాయికి చేరింది. ఇప్పుడు మీరు నీతులు చెప్పడం విచిత్రం” అంటూ వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ ఆరోపణలతో కొత్త వివాదం రాజుకున్నా, అధికార పార్టీ, ప్రతిపక్షం మధ్య ఈ సోషల్ మీడియా యుద్ధం ఎక్కడ ఆగుతుందోనన్నది ఇప్పుడు