నేడు వైసీపీ మాక్ అసెంబ్లీ
ఏపీలో వైసీపీ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. దీనిలో మాక్ అసెంబ్లీపై నిర్ణయం తీసుకుంటారు. నేటి ఉదయం 10.30 గంటల సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై శాసనసభకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి పార్టీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటనే విషయాలపై మాక్ అసెంబ్లీ నిర్వహించి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే అవకాశాలపై చర్చిస్తారు. శాసన మండలి కార్యక్రమాలకు మాత్రం హాజరు కావాలని వైసీపీ నిర్ణయించింది.