Andhra PradeshHome Page Slider

నారా లేకేశ్‌కు వైసీపీ ఎమ్మేల్యే అనిల్ సవాల్

ఏపీలో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కాగా మరికొన్ని నెలల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని అధికార,ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పర విమర్శలతో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ టీడీపీ నేత లోకేశ్‌కు సవాల్ విసిరారు. కాగా అనిల్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..దమ్ముంటే లోకేశ్  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరులో నాపై పోటి చేయాలన్నారు. అక్కడ నా గెలుపును లోకేశ్ ఆపగలిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అనిల్ శపథం చేశారు. కాగా తనను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు టీడీపీ ఇప్పటికే రూ.200 కోట్లు సిద్ధం చేసిందని తెలిపారు. నా కుటుంబానికి ఎటువంటి చరిత్ర లేకపోయిన నెల్లూరులో ఎమ్మేల్యేగా గెలిచానని అనిల్ కుమార్ వెల్లడించారు. కానీ తాత,నాన్న సీఎంలైనా లోకేశ్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలలేకపోయారని ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు.