Andhra PradeshHome Page Slider

జీవో నెం.1 పై సుప్రీంకోర్టుకు వెళ్తామన్న వైసీపీ మంత్రి

ఏపీలో  వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.1ను ఏపీ హైకోర్టు తాజాగా కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలోని ప్రతిపక్ష నేతలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం హైకోర్టు జీవో నెం.1ను కొట్టివేయడంపై అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దీనిపై మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..జీవో నెం.1 పై సుప్రీంకోర్టు ఆశ్రయిస్తామన్నారు. జీవో నెం.1 రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు కాపాడటానికి తీసుకు వచ్చామన్నారు. కాగా రాష్ట్రంలో అభివృద్ధిపై ఫ్లెక్సీలు పెడితే అది పెద్ద కర్మ అంటారా అని మంత్రి కారుమూరి మండిపడ్డారు. గతంలో లాగా బీసీల తోకలు కత్తిరిస్తానన్నారు. అసలు ప్రతిపక్ష నేత చంద్రబాబు యాత్రలో 500 మంది కూడా లేరన్నారు. యాత్రలో మేము మీతో పోటికి దిగితే మీరు యాత్ర చేయలేరని కారుమూరి నాగేశ్వరరావు ఏపీలోని ప్రతిపక్ష నేతలకు సవాల్ చేశారు.