మరో గంటలో వైసీపీ జాబితా విడుదల
రెండోస్సారి అధికారాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న వైసీపీ అభ్యర్థుల జాబితాను గతంలోలా ఒకసారి విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల వడపోతలు పూర్తి చేసిన సీఎం జగన్, మరికాసేపట్లో జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 174 స్థానాల్లో సగానికి పైగా సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూటమి ద్వారా పోటీ చేస్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలను ఎదుర్కొనేందుకు ఈసారి జగన్మోహన్ రెడ్డి సామాజిక అస్త్రాన్ని బయటకు తీస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే బీసీలకు 50కి పైగా సీట్లను కేటాయిస్తారని, ఎస్సీ, ఎస్టీ స్థానాలే కాకుండా మరికొన్ని స్థానాలు ఆ వర్గాలకు ఇస్తారంటున్నారు. ఇక మైనార్టీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదారు సీట్లను జగన్ కేటాయించే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలకు లిస్టుపై క్లారిటీ ఉందని చెబుతున్నారు.