వైసీపీ నేత రిమాండ్ పొడిగింపు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదయిన సంగతి తెలిసిందే. ఆయన రిమాండ్ నేటితో ముగియనుండడంతో విజయవాడ ఎస్టీ, ఎస్సీ కోర్టు మార్చి 11 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో పక్క వంశీని మూడు రోజుల కస్టడీకి పోలీసులు కోరడంతో కోర్టు అంగీకరించింది. దీనితో జైలు వద్దకు పటమట పోలీసులు చేరుకుని వంశీని కస్టడీలోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో వైద్య పరీక్షలకు తరలించారు.

