జనసేనకు వైసీపీ అదిరిపోయే కౌంటర్
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో సంచలనం రేగింది. అతి వేగంగా పది లక్షల మంది ఫాలోయర్లు సొంతమయ్యారు. ఈ విషయంపై జనసైనికులు వైసీపీ పార్టీని ఎద్దేవా చేశారు. పదేళ్లుగా ఇన్‌స్టాలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌కు అంతమంది ఫాలోయర్లు లేరని, పవన్‌కు రెండ్రోజుల్లోనే పది లక్షల మంది ఫాలోవర్లు వచ్చారని కౌంటర్ ఇవ్వగా, దీనికి వైసీపీ కూడా అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. సీఎం జగన్‌కు ఈ పదేళ్లలో 151 మంది ఎమ్మెల్యేలు, 31 ఎంపీలు, 43 మంది ఎమ్మెల్సీలు ఉన్నారని, పవన్ కళ్యాణ్‌కు మాత్రం పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడని, పవన్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడని రిటార్ట్ ఇస్తున్నారు.

