ఏపీ అసెంబ్లీ సమావేశాలలో నల్ల కండువాలతో వైసీపీ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుడు జగన్ నల్ల కండువాలతో వచ్చి, నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, రౌడీయుజం రాజ్యమేలుతోందని ఆరోపించారు. వినుకొండి హత్య ఘటన, నంద్యాల చిన్నారి మృతి వంటి దుర్ఘటనలపై ప్రభుత్వం సమాధానమివ్వాలని నినాదాలు చేశారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభించడంతో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసలను మొదలుపెట్టారు. నల్ల కండువాలు చూపిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ స్లోగన్లు ఇచ్చారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలందరూ సభ నుండి వాకౌట్ చేశారు. అసెంబ్లీ వద్ద నిరసనలు చేస్తున్నఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను జగన్‌తో సహా పోలీసులు అడ్డుకున్నారు. వారి చేతుల్లోని ప్లకార్డులను చింపివేశారు. దీనితో పార్టీ నాయకుడు జగన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లకార్డులు చింపే అధికారం మీకు ఎవరిచ్చారు. అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదు. పోలీసులు ఉన్నది ప్రభుత్వానికి సలాం కొట్టడానికి కాదు అంటూ మండిపడ్డారు. జగన్ మాట్లాడిన వీడియోను వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.


 
							 
							