Andhra PradeshHome Page Slider

‘వారాహి యాత్రలో వైసీపీ గుండాల గ్యాంగ్‌ను సహించేది లేదు’..పవన్

పెడనలో జరగనున్న జనసేన సభను చెదరగొట్టాలని వైసీపీ గూండాలు, క్రిమినల్ గ్యాంగ్‌లు ప్లాన్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్ర డీజీపీ, డీఎస్పీలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులివెందుల మైండ్ సెట్ ఇక్కడ పనిచేయదని పవన్ హెచ్చరించారు. జనసైనికులు సభలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా జేబుల్లోంచి, కత్తులు, మారణాయుధాలు వంటి వాటిని బయటకు తీస్తుంటే వారిని అక్కడే కట్టేసి, పోలీసులకు అప్పగించాలని సూచించారు. జన సైనికులకు అండగా, మిత్రపక్షమైన టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారన్నారు. వారు కూడా జనసేన సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని అభ్యర్థించారు. ఎట్టి పరిస్థితులలో జనసేన పార్టీ అభిమానులు సహనం కోల్పోవద్దని, ఎవరినీ దూషించవద్దన్నారు. సహనంగానే రౌడీల పని పడదామని తెలియజేశారు.