Andhra PradeshHome Page Slider

జిల్లా కేంద్రాలలో వైసీపీ ఫీజు పోరు

వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రతీ జిల్లా కేంద్రంలోనూ వైసీపీ ఫీజు పోరు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 5 నుండి ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రబాబు విధానాలు పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగిస్తున్నాయని, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకుండా కూటమి సర్కారు వేధిస్తోందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో తెచ్చిన ఈ పథకం వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకున్నారని, కానీ ఇప్పుడు చంద్రబాబు ఈ పథకానికి మంగళం పాడారని మండిపడ్డారు. బకాయిలు పెట్టిన రూ.3,900 కోట్లను వెంటనే చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు.