ఏపీలో వైసీపీ క్రూరమైన పాలన మరో ఏడాది కొనసాగుతోంది: చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ నాలుగేళ్ల పాలనపై ప్రతిపక్షనేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఏపీలో జగన్ పాలన ప్రారంభించిన మొదటి రోజే “ఫస్ట్ డిమోలీషన్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్” అని చెప్పారన్నారు. దానినే సీఎం జగన్ ఇప్పటికీ కొనసాగిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కాగా ప్రజావేదికను కూల్చడంతో ఏపీలో జగన్ విధ్వంస పాలన మొదలైంది అన్నారు. ఈ విధంగా వైసీపీ ఏపిలో నాలుగేళ్లు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని పేర్కొన్నారు. అయితే ఇదే క్రూరమైన పాలన మరో ఏడాది కూడా కొనసాగుతోందని ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. చంద్రబాబు ట్వీట్ చేశారు.