వైసీపి 70mm స్క్రీన్ రెడీ
ప్రశ్నిస్తే అరాచకం….పాత పోస్టులు బయటకు తీసి మరీ అరెస్టులు…హక్కుల కోసం నినదిస్తే వేధింపులు…రోడ్డు మీదకొచ్చి మాట్లాడితే రెడ్‌బుక్ కి పనిచెప్పడం..ఈ ఐదు నెలల్లో ఏపిలో కూటమి సర్కార్ సాగించిన దమనకాండ ఇది అంటూ వైసీపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంబటి రాంబాబు లాంటి వాళ్లు నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి మరీ జగన్ మీద పెట్టిన పోస్టులపై కేసులుండవా అని అడుగుతున్నా పోలీసులు స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో అన్నదాతలకు గిట్టుబాటు ధర కోరుతూ పవర్ లాస్ అయ్యాక మొట్టమొదటి సారిగా ఈనెల 13న పోరుబాట సాగించనున్నారు.జగన్…జనంలోకొస్తే చాలు అనుకుంటూ తాడిత పీడిత ప్రజంలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దీంతో వైసీపిలోనే కాదు..సామాన్యుల్లోనూ ఉత్సాహం తాండవిస్తుంది.సంతోషం కట్టలు తెంచుకుంటుంది అన్నట్లుగా వైసీపి సోషల్ మీడియా శివతాండవం చేస్తుంది.జగనన్న వస్తున్నాడహో అంటూ ఫేస్‌బుక్,ఎక్స్,ఇన్స్టా ఇలా అన్నీ సోషల్ మాధ్యమాల్లో పోరుబాటుకు రెడీ…రేపే వైసీపి 70mm స్క్రీన్ సిద్ధం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.