Home Page SliderNational

భద్రాచలం చేరిన మహారాష్ట్ర సాధువుల సాష్టాంగనమస్కార యాత్ర

మహారాష్ట్ర నుండి సాష్టాంగ నమస్కారాలతో ముగ్గురు సాధువులు యాత్ర చేస్తున్నారు. వీరు ఈరోజు భద్రాచలం చేరుకున్నారు. లోకకళ్యాణార్థం తాము ఈ యాత్ర చేపట్టినట్లు తెలియజేశారు. వీరు 2024నాటికి రామేశ్వరం చేరుకుని తమ యాత్రను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వీరు కేవలం సాష్టాంగనమస్కారాలు మాత్రమే చేసుకుంటూ తమయాత్రను కొనసాగిస్తున్నారు. ఏ వాహనం ఎక్కడం కానీ, నడవడం కానీ చేయకుండా ఒక చాపను రోడ్డుపై వేసుకుంటూ, దానిపై బోర్లాపడి నమస్కారం చేసి, తిరిగి లేచి ముందుకు చాపను వేసుకుంటూ తమ భక్తియాత్రను కొనసాగిస్తున్నారు.