Home Page SliderInternational

యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డ్

ఈ ఏడాది జరిగిన IPLలో యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ యువకెరటం ఇటీవల టీమిండియాకు ఎంపిక అయ్యాడు.  అయితే టీమిండియాలో కూడా యశస్వి జైస్వాల్ సత్తా చాటుతున్నాడు. కాగా నిన్న వెస్ట్ ఇండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో యశస్వి సెంచరీ చేసి అదరగొట్టాడు. దీంతో ఈ టీమిండియా ఓపెనర్ అరుదైన రికార్డును సృష్టించాడు. టెస్టుల్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే ఎక్కువ బాల్స్ ఆడిన ఆటగాడిగా యశస్వి నిలిచాడు.అయితే గతంలో అజాహరుద్దీన్ తన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 322 బాల్స్ ఆడాడు. కాగా నిన్న జరిగిన వెస్ట్ ఇండీస్ మ్యాచ్‌లో యశస్వి 350 బాల్స్ ఆడి..గత రికార్డును బద్దలు కొట్టాడు. అయితే ఈ 21 ఏళ్ల యువ కెరటం ఇంకా క్రీజులోనే ఉండడంతో ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో చూడాలి.