జగన్ సర్కార్‌పై యనమల ఆగ్రహం
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మరోసారి ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం జగన్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని, ట్రెజరీ కోడ్ ఉల్లంఘించి అనుచరులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇందుకు నిదర్శనమన్నారు. ఓడీ కింద తీసుకొచ్చిన రూ. 31 వేల కోట్లను దేనికి ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయంలో ఏడాదికి సరాసరి రూ. 32,800 కోట్లు అప్పు చేసిందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఏడాదికి రూ. 1,11,472 కోట్లు అప్పు చేసిందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లోనే రూ. 46. 803 కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. మద్యంపై బాండ్లు, ఏపీఎస్డిసి అప్పులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3) కి పూర్తిగా విరుద్దమని యనమల అన్నారు.