Andhra PradeshHome Page Slider

యనమల ఓ రాజకీయ శకుని:వైసీపీ మంత్రి

ఏపీ రాజకీయాల్లో మాటల రగడ మొదలయినట్లు కన్పిస్తోంది. కాగా త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార,ప్రతిపక్ష పార్టీలు పరస్పర విమర్శలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడిపై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి మాట్లాడుతూ..యనమల ఓ రాజకీయ శకుని అని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టించడం యనమల సోదరులకు పైశాచిక ఆనందమని ఆయన మండిపడ్డారు. ఏపీలో ఎన్నికల్లొస్తున్నాయనే తునిలో యనమల మోకాళ్ల యాత్ర చేస్తున్నారని అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లోనూ యనమలకు ఓటమి తప్పదని మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు.