Andhra PradeshHome Page Slider

Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి-షర్మిల సెటైర్లు

ఇప్పుడున్నది YSR కాంగ్రెస్ పార్టీ కాదని.. Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి-షర్మిల సెటైర్లు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో మీ పార్టీలో YSR లేడన్నారు. అది జగన్ రెడ్డి పార్టీ అని, నియంత పార్టీ అని, ప్రజలను పట్టించుకోని పార్టీ అంటూ దుయ్యబట్టారు. ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ అని… వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టని పార్టీ అని దుయ్యబట్టారు. తనను విమర్శించడం దారుణమన్న షర్మిల… నా సొంతవాళ్లనుకొని 3200 కిలో మీటర్ల పాదయాత్ర చేశానన్నారు. సొంత బిడ్డలను వదులుకొని వైసీపీని భుజాలపై వేసుకున్నానన్నారు. చెమటను ధారపోసి, రక్తం చిందించానన్నారు. ఆ వైసీపీ ఇప్పుడు తనపై దాడి చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఎంతలా విమర్శించినా భయపడబోనన్న షర్మిల, యుద్ధానికి తాను సిద్ధమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని, పోలవరం నిర్మాణం జరగాలన్నారు. విశాఖ స్టీల్ ఉండాలని… ఉద్యోగాలు కావాలన్నారు. రైతు రాజ్యం రావాలనే… వైఎస్సార్ బిడ్డ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టిందన్నారు షర్మిల.