వైఎస్ జగన్ పుత్రికోత్సాహం
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుత్రికోత్సాహంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన కుమార్తె వర్షారెడ్డి ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పుచ్చుకున్న సందర్భంగా ఎక్స్ ఖాతాలో అభినందనలు తెలిపారు. వర్షమ్మకు అభినందనలు అంటూ కామెంట్ చేశారు. లండన్ కింగ్స్ కాలేజీలో మంచి మార్కులతో మాస్టర్స్‌లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణమయ్యావని, భగవంతుని ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా భార్య, పిల్లలతో కూడిన ఫోటోను పోస్టు చేశారు.

