ఏపీ డిప్యూటీ సీఎంకు Y ప్లస్ సెక్యూరిటీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. కాగా ఆయనకు Y ప్లస్ భద్రతను నియమించింది. ఈ మేరకు ఆయనకు ఎస్కార్ట్,బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏపీ సచివాలయానికి వెళ్లి 2వ బ్లాక్‌లో ఉన్న తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. కాగా రేపు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

