లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలకు ‘Y’ కేటగిరీ సెక్యూరిటీ
మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న ఇటీవల అధికారులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. వీరిద్దరికీ ‘Y’ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
ఇటీవల మావోయిస్టు అధికార ప్రతినిధి ‘అభయ్’ పేరిట విడుదలైన హెచ్చరిక లేఖలో, ఈ ఇద్దరు నమ్మకద్రోహం చేశారని, తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశాన్ని కేంద్రం సీరియస్‌గా పరిగణించినట్లు తెలుస్తోంది.
మావోయిస్టు లొంగుబాట్ల ప్రక్రియలో భయాందోళనలు నెలకొనకుండా చూడడం కోసం, అలాగే లొంగిపోయిన నేతలకు ఏ అనర్థం జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.