వామ్మో.. రిలయన్స్ స్మార్ట్ లో కుళ్లిన ఆహార పదార్థాలు
తెలంగాణలోని వనపర్తి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ లో కుళ్లిన ఆహార పదార్థాలు దర్శనమిచ్చాయి. మార్ట్‌లో కొన్న ఆహార పదార్ధాలు ఫంగస్ పట్టి కుళ్లిపోవడంతో యజమానికి కస్టమర్ ఫిర్యాదు చేశాడు. యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు కస్టమర్ ఫిర్యాదు చేశాడు. కస్టమర్ ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మార్ట్‌ను తాత్కాలికంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసి మూసివేశారు.