వావ్.. సామ్సంగ్ ఫోన్లపై ఆఫర్లు
ఫాప్ గెలాక్సీ ఎస్ ఎంఎఫ్ సిరీస్ స్మార్ట్ ఫోన్ లపై ధరలను తగ్గిస్తున్నట్టు సామ్సంగ్ ప్రకటించింది. గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఎస్ఈ ధర రూ. 54,999 నుంచి రూ.27,999లకు తగ్గింది. గెలాక్సీ ఎస్. 23 ధర రూ. 74,999 నుంచి ఇప్పుడు కేవలం రూ. 37,999కి అందుబాటులోకి వచ్చింది. గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 24 సిరీస్ ఫోన్లు, గెలాక్సీ ఎస్ 24, గెలాక్సీ ఎస్ 24 ప్లస్, గెలాక్సీ ఎం 35 5జీ, గెలాక్సీ ఎం05, గెలాక్సీ ఎఫ్ 05 ఫోన్లపై ఈ నెల 26 నుంచి ఆఫర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. కొన్ని బ్యాంకుల కార్డులతో కొంటే ఇన్ స్టంట్ డిస్కౌంట్లు ఇస్తామని తెలిపింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లూ కూడా ఉన్నాయని సామ్సంగ్ తెలిపింది.

