Home Page SliderNational

వామ్మో.. ఆమెకెంత ధైర్యం..

పాము కనిపిస్తే ఆమడ దూరం పరిగెత్తుతాం. ఇక పామును పట్టుకోవాలంటే.. అబ్బో ఎంతో ఓర్పు, నేర్పు కావాలి మరి.. పామును పట్టుకోవడం అందరితో అయ్యే పనికాదు. అందులోనూ అమ్మాయిలు పాములు పట్టడం అంటే.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది. పాము విష ప్రాణి అని తెలిసినా దాన్ని కాపాడేందుకు ధైర్యంగా ముందుకెళ్లిందో ఓ యువతి. ఆమె పేరు నిర్జరా చిట్టీ. కర్ణాటకకు చెందిన ఆమె పాముల రక్షకురాలు. పాములు జనావాసంలో లేదా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వెళ్లి వాటిని రక్షిస్తుంది. తల వలలో చిక్కుకుపోయి అవస్థ పడుతున్న సర్పాన్ని ఆమె ఇలా రక్షించగా అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె చేసిన సాహసానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.