Home Page SliderSportsTrending Today

చెత్త రికార్డు నమోదు చేసిన RCB

ప్రస్తుతం దేశవ్యాప్తంగా IPL హవా నడుస్తోంది. కాగా ఈ IPL సీజన్‌లో జట్టులన్నీ నువ్వా నేనా అన్నట్టుగా పోటి పడుతున్నాయి. దీంతో ఈ IPL సీజన్‌ చాలా రసవత్తరంగా మారింది. అయితే గత IPL సీజన్‌లో అదరగొట్టిన RCB. ఇప్పుడు మాత్రం చెత్త రికార్డులు సృష్టిస్తూ..అభిమానులను నిరాశ పరుస్తుంది. కాగా నిన్న జరిగిన IPL మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో 81 పరుగుల తేడాతో RCB ఓటమిపాలయ్యింది. దీంతో RCB IPLలో ఇప్పటివరకు ఉన్న చెత్త రికార్డును సమం చేసింది. IPLలో అత్యధిక సార్లు 125 పరుగుల లోపు ఆలౌటైన జట్టుగా ఢిల్లీ కెపిటల్స్ ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. అయితే ఆ రికార్డుతో సమానంగా RCB ఇప్పుడు సరితూగింది. అయితే నిన్న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో  RCB పరాజయం పాలై ఆ రికార్డును సమం చేసింది. RCB తర్వాత స్థానంలో రాజస్థాన్ 11సార్లు,KKR & MI 9  సార్లు125లోపు పరుగులు చేసి ఆలౌట్ అయ్యాయి.