వామ్మో.. చికెన్‌లో పురుగులు
చికెన్‌లో పురుగులు కనిపించిన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో కలకలం రేపింది. అక్కడ ఓ వ్యక్తి చికెన్ కొనుక్కొని ఇంటికి వెళ్లాడు. వండేందుకు సిద్ధమైన క్రమంలో అందులో పురుగులు కనిపించాయి. దీంతో షాకైన ఆ వ్యక్తి షాపుకు వెళ్లి ఓనర్‌ను ప్రశ్నించగా.. అతను నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవ్వడంతో మాంసం షాపుల్లోనూ తనిఖీలు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.