“ప్రపంచంలోనే అతిపెద్ద క్రైమ్..సైబర్ క్రైమ్”: సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణా యాంటీ నార్కోటిక్స్,సైబర్ సెక్యూరిటీ బ్యూరోల కొత్త వాహనాలను ప్రారంభించారు . ఈ సందర్భంగా తెలంగాణా పోలీసు వ్యవస్థపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం మాట్లాడుతూ..ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అందుకే పోలీస్ వ్యవస్థకు కావాల్సిన నిధులు, అధికారులను కేటాయించామన్నారు. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ క్రైమ్. అయితే రాష్ట్రంలో జరిగే నేరాలను ఎదుర్కోవడంలో సైబర్ క్రైం టీమ్ సమర్ధవంతంగా పని చేస్తోందన్నారు. అందుకు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అన్నారు.డ్రగ్స్ మహమ్మారితో కుటుంబం, వ్యవస్థ నాశనమవుతున్నాయి. ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలంగాణలో దురదృష్టవశాత్తు గల్లీ గల్లీలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిందన్నారు.కాగా రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు సిబ్బందిని కేటాయించామని సీఎం తెలిపారు. గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయన్నారు. చిన్నారులపై దాష్టీకం జరుగుతున్న ఘటనలకు ప్రధాన కారణం మాదకద్రవ్యాలే అని సీఎం పేర్కొన్నారు.తెలంగాణ యువకులు డ్రగ్స్ కు బానిసలు కాదు.. సమస్యలపై పోరాటం చేసే సమర్థులుగా ఉండాలని సీఎం సూచించారు. తెలంగాణాలో డ్రగ్స్ నియంత్రణలో సమర్ధవంతంగా పనిచేసినవారికి పదోన్నతి కల్పిస్తామని సీఎం హమీ ఇచ్చారు. కాగా దీనికి సంబంధించి శాసనసభలో చర్చించి చట్టాన్ని రూపొందిస్తామన్నారు.మీడియా రాజకీయ వివాదాలపై కాకుండా సమాజంలో సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం కోరారు.తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడాలంటే భయపడాలని సీఎం వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే.. నేరగాళ్లకు కాదని సీఎం స్పష్టం చేశారు.