InternationalNews

800 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా

ప్రపంచ జనాభా (World Population) మరో మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం ఈ భూమి మీద ఉన్న జనాల సంఖ్య 800 కోట్లను తాకింది. మంగళవారం 800వ కోట్ల శిశువు ఈ భూమ్మీదకు వచ్చినట్లు ఐక్యరాజ్యసమితి (United Nations) వెల్లడించింది. 48 ఏళ్లలో ప్రపంచ జనాభా రెట్టింపు అయింది. 1974లో ప్రపంచ జనాభా 400 కోట్లుగా ఉండేది. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గి.. ఆయుర్దాయం గణనీయంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణమని ఐరాస తెలిపింది. మరో 15 ఏళ్లకు అంటే.. 2037 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరే అవకాశముందని అంచనా వేసింది.

మనీలాలో పుట్టిన 800వ కోట్ల శిశువు


వైద్య రంగ పురోభివృద్ధితో పెరిగిన ఆయురార్ధం..

క్రీస్తు పూర్వం 8000వ సంవత్సరంలో ప్రపంచ జనాభా దాదాపు 50 లక్షలుగా ఉండేదని అంచనా. క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికి అది 20 కోట్లకు చేరింది. కొన్ని అంచనాలు మాత్రం 30 కోట్లు, 60 కోట్లు అని కూడా చెబుతున్నాయి. 1804వ సంవత్సరంలో ప్రపంచంలో మానవుల సంఖ్య వంద కోట్లకు చేరింది. పారిశ్రామిక విప్లవంతో ఆర్థిక పురోభివృద్ధి ఊపందుకుంది. వైద్యంలో అద్భుత పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా శిశువుల్లో అకాల మరణాలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా సగటు ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది. ఇది జనాభా పెరుగుదలకు దారితీసింది.