అంగరంగ వైభవంగా ఒడిశాలో ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్
జనవరి 13 నుంచి పురుషుల హాకీ ప్రపంచకప్ ఒడిషాలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పోటీలో పాల్గొనే అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ టోర్నమెంట్ క్రీడాస్ఫూర్తిని బలోపేతం చేయగలదని, దీనికి ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు ఎంతో గర్వకారణం అని ప్రకటించారు. ఈ టోర్నీ ప్రారంభవేడుకలు కటక్‌లోని బారాబతి స్టేడియంలో ప్రారంభం అయ్యాయి. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టిర్కీ ఈ వేడుకకు హాజరయ్యారు. వివిధ దేశాలకు చెందిన 16 జట్లు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. FHS ప్రెసిడెంట్ తైబ్ ఇక్రమ్ ప్రసంగిస్తూ ఈ టోర్నమెంట్‌కు ఒడిశా వరుసగా రెండుసార్లు ఆతిథ్యం ఇచ్చిందని, అందుకే ఈ రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ హాకీ అని పేర్కొన్నారు. 2018లో కూడా ప్రపంచకప్‌ను ఒడిశా నిర్వహించింది.
ఈపోటీలు జనవరి 13 నుండి 29 వరకు రూర్కెలాలోని బిర్సాముండా స్టేడియం, భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలలో జరగబోతున్నాయి. మొత్తంగా రూర్కెలాలో 20 మ్యాచ్‌లు జరుగుతాయి. భువనేశ్వర్‌లో ఫైనల్‌తో సహా 24 మ్యాచ్‌లు జరగనున్నాయి.