శిల్పారామంలో వరల్డ్ బ్యూటీల ఆటాపాటా..
హైదరాబాద్ నగరంలోని శిల్పారామంలో మిస్ వరల్డ్ బ్యూటీలు సందడి చేశారు. అక్కడ విక్రయస్టాళ్లను పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ముగ్ధులయ్యారు. అక్కడి పిల్లలతో ఆటలాడారు, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మిస్ వరల్డ్ బ్యూటీల రాకతో శిల్పారామం కొత్త శోభను సంతరించుకుంది. వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

