రైతు భరోసాపై నేటి నుండి వర్క్‌షాప్‌లు
టిజి: రైతు భరోసా పథకం విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యశాలలకు మంత్రివర్గ ఉపసంఘం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అన్ని జిల్లాల నుండి వచ్చిన అభిప్రాయాలను జోడించి నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనుంది.