పని ఒత్తిడి తాళలేక బలవన్మరణం
పని ఒత్తిడి తాళలేక బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఏపిలోని బాచుపల్లిలో జరిగింది. పిఠాపురంకు చెందిన కోట సత్యలావణ్య (32)కు అదే ప్రాంతానికి చెందిన బత్తుల వీరమోహన్‌తో ఐదేళ్ల కిందట వివాహమైంది. బాచుపల్లిలోని ఎంఎన్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. లావణ్య బాచుపల్లిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తుంది. కొన్నాళ్లుగా బ్యాంకులో పని ఒత్తిడి ఉన్నట్లు ఆమె బంధుమిత్రుల వద్ద వాయిపోయిందని చెబుతున్నారు. ఈ క్రమంలో భవనం పైనుంచి దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

