మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నేడే ప్రారంభం
క్రీడాభిమానులు ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ నేడు ప్రారంభం కాబోతోంది. వేలంతోనే అంచనాలు పెంచేసిన ఈ లీగ్ మ్యాచ్‌లు 5 జట్లతో, పోటాపోటీగా 23 రోజులపాటు కలర్‌ఫుల్‌గా జరగబోతున్నాయి. ఈ మ్యాచ్‌లలో 15 ఏళ్ల వయస్సు నుండి సీనియర్ల వరకూ ఆడబోతున్నారు. ఫైనల్స్ ఈ నెల 26న జరగబోతోంది. గుజరాత్ జెయింట్స్, డిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు హోరాహోరీగా తలపడబోతున్నాయి. నిజానికి ఈ మ్యాచ్‌లు 2018లోనే మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీని ఆరంభించారు. అప్పుడు ఒకే ఒక మ్యాచ్ జరిగింది. గత మూడేళ్లగా మరో జట్టు పెరిగి మూడు జట్ల మధ్య ఈ టోర్నీ జరిగింది. ఈ మూడు జట్లు ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ఐపీఎల్‌లో జట్లను కలిగి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లలో యూపీ, గుజరాత్‌లు కొత్తగా బరిలో దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లు డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ ప్రకారం జరుగుతాయి. లీగ్ దశలో ప్రతిజట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ప్రతిజట్టులో పాయింట్ల ప్రకారం అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. దానితో పోటీ కోసం మిగిలిన మూడు స్థానాలలో నిలిచిన జట్లు పోటీ పడతాయి. బాలికలకు, మహిళలకు బీసీసీఐ ఒక కానుకను అందిస్తోంది. అదేంటంటే ఈ మ్యాచ్‌లన్నీ ఉచితంగా స్టేడియంకు వెళ్లి చూసే అవకాశాన్ని కల్పించింది. ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో గుజరాత్ ,ముంబయి పోటీ పడబోతున్నాయి.