మహిళల ఆసియా కప్ విజేత ఇండియా
ఆసియా కప్‌ను మరోసారి భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్ ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్‌ను దేశానికి అందించింది. ఫైనల్‌లో స్వల్ప లక్ష్యఛేదనను భారత్ అలవోకగా పూర్తి చేసింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో స్మృతి మందాన ఆఫ్ సెంచరీతో ఔరా అనిపించింది. ఆసియా కప్‌లో మొదటి నుంచి భారత్ మహిళల జట్టు ప్రతిభను కనబరుస్తూ వచ్చింది. ముందుగా అనుకున్నట్టుగా… ఫైనల్స్‌లో చెలరేగి ఆడింది. ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థులకు చెమటలు పట్టించి ఆసియా కప్ విజేతగా నిలిచింది. తుది పోరులో శ్రీలంకపై నెగ్గిన టీమిండియా ఘన విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్‌లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు సాధించింది. మొదటి బ్యాంటిగ్ చేసిన శ్రీలంక 65/9 కాగా, భారత్ స్కోర్ 71/2 గెలుపొందింది. మొత్తంగా భారత్ మహిళల జట్టు ఏడో సారి ఆసియా కప్‌ను దక్కించుకుంది.