Home Page Sliderhome page sliderNational

ఆ అలవాటులో మగవాళ్లను మించిన మహిళలు..!

ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ మహిళలు తమ సత్తా చాటుతున్నారు. అయితే ఒక చెడు అలవాటులో కూడా మహిళలు దేశంలో మగవాళ్లపై పైచేయి సాధిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా వైరల్ అయిన ఓ వీడియోలో భారతీయ మహిళలు స్మోకింగ్ అలవాటులో పురుషులను దాటేశారని చెబుతున్నారు. ఒక సర్వేలో గత ఏడాది మహిళల్లో 6.2 శాతం మంది స్మోకింగ్ అలవాటు పెంచుకోగా, పురుషుల్లో మాత్రం ఇది 2.3 శాతంగానే ఉందని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. దీంతో పెరుగుతున్న ఈ చెడు అలవాటు మహిళలను ఎంత ఇబ్బందికి గురి చేస్తుందో డాక్టర్లు సైతం హెచ్చరిస్తున్నారు.