Home Page SliderTelangana

ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను కలిసిన మహిళా ఐఏఎస్‌లు

ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను నేడు పలువురు ఐఏఎస్ అధికారులు కలిసారు. కేంద్రసర్వీసుల నుండి వచ్చిన ఆమ్రపాలి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను సీఎంవో కార్యదర్శిగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా స్మితా సబర్వాల్ నేడు మంత్రి సీతక్కను కలిసారు. స్మితా సబర్వాల్ రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటయినప్పడి నుండి ప్రభుత్వానికి కాస్త దూరంగానే ఉన్నారు. ఉత్తమకుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా హాజరు కాలేదు. దీనితో ఆమె కేంద్రసర్వీసులకు వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని త్రోసిపుచ్చారు స్మిత. తన ట్విటర్‌లో తాను కేంద్రసర్వీసులకు వెళ్లబోవడం లేదని, ఇక్కడే ప్రభుత్వం ఏ శాఖలిస్తే అక్కడ పని చేస్తానని పేర్కొన్నారు. ఆమె మంత్రులను కలవడం ఇదే మొదటిసారి.