Home Page SliderInternational

మహిళలు 8 లేక ఎక్కువమంది పిల్లల్ని కనండి: పుతిన్

మాస్కో: రష్యా జనాభాను పెంచడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. మహిళలు ఎనిమిది మంది లేక అంతకన్నా ఎక్కువమంది పిల్లలను కనాలని, పెద్ద కుటుంబాలను ఏర్పరచాలని కోరారు. మంగళవారం మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్‌లో ప్రసంగించారు. మన అమ్మమ్మలు, ముత్తాతలలో చాలామంది ఏడు, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నారని గుర్తుంచుకోండి. వారంతా సాంప్రదాయక వారసత్వాన్ని కాపాడుకున్నారు. దేశ జనాభా పెరగడం ప్రస్తుతం తప్పనిసరి అవసరం. మన జాతి పునాదులకే గాక ఆధ్యాత్మిక వారసత్వానికి ఇది ఎంతో ముఖ్యం అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలోనూ భారీ సంఖ్యలోనే దాదాపు 3 లక్షల మంది మృతి చెందారు. రష్యా విధానాలు నచ్చక దేశాన్ని విడిచిన వారి సంఖ్య దాదాపు 8 నుండి 9 లక్షలు రష్యాను విడిచి పారిపోయారని సమాచారం.