మహిళలు ఐదు సెట్లు ఆడలేరు..టాప్ స్టార్..
లండన్: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ సబలెంక మహిళల ఐదు సెట్ల ఆటపై ఇటీవల మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మహిళల టెన్నిస్ లో కూడా పురుషుల టెన్నిస్ వలే ఐదు సెట్లు ఉండాలన్న వాదనను తోసిపుచ్చింది. “శారీరకంగా చూస్తే చాలామంది కంటే నేను బలంగా ఉంటా. నాలాంటి వాళ్లకు అయిదు సెట్ల ఫార్మాట్ లాభమే. అలా అని ఆడలేను. సుదీర్ఘంగా పోటీపడేందుకు మహిళల శరీరం అనువుగా ఉండదు. గాయాల పాలయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే దీనికి నేను వ్యతిరేకం. అయిదు సెట్లు.. అయిదు గంటలపాటు సాగుతుంటే చూసేవాళ్లకు బగానే ఉంటుంది. అలాంటి ఆటల సమరాలను స్టాండ్లో కూర్చొని ఆనందిస్తా, కోర్టులో దిగి ఆడడమే కష్టం. ఒక సారి ఐదు సెట్లు ఆడాక కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు” అని సబలెంక పేర్కొంది.