నా విజయానికి మహిళలే కారణం..మోదీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నారీ శక్తికి వందనం అంటూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు దేశ ప్రగతిలో, అభివృద్ధిలో ఎనలేని పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఈనాడు తమ ఎన్డీయే ప్రభుత్వం ఇంత విజయవంతం కావడానికి కారణం మహిళలేనని, తన సోషల్ మీడియా ఖాతాలను కూడా వారే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీయే ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తోందని వెల్లడించారు.
