Telangana

మునుగోడులో మహిళా, యువత ఓటర్లే కీలకం

మునుగోడు ఉపఎన్నికలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల ముఖ్యనేతలందరు మునుగోడుకు చేరుకుని ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా నాయకులంతా కృషి చేస్తున్నారు. ఈ ఎన్నికలో అభ్యర్థుల భవితవ్యం మహిళా, యువత ఓటర్ల మీదే ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,367 ఓటర్లలో 1,19,859 మహిళా ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలోని 159 గ్రామ పంచాయతీల్లో 79 స్థానాల్లో మహిళలే సర్పంచులుగా ఉన్నారు.71 ఎంపీటీసీ స్థానాల్లో 35 స్థానల్లో మహిళలే పదవులు నిర్వహిస్తున్నారు.వీరితో పాటు యువ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో అన్ని పార్టీలు వారి మీదే ఫోకస్ పెట్టాయి. ఇక్కడ దాదాపు సగం మంది ఓటర్లు యువతే కావడంతో వారిని ఆకట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నాయని సమాచారం.