Home Page SliderInternationalviral

విమానంలో మహిళ వికృత చేష్టలు..భయంతో ప్రయాణికులు

అమెరికాలోని హ్యూస్టన్ నుండి ఫీనిక్స్ వెళ్తున్న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఒక మహిళ చేసిన వికృత చేష్టలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. ఒక మహిళ విమానం టేకాఫ్ అవుతుండగా బిగ్గరగా కేకలు వేస్తూ, తన దుస్తులు తొలగించుకుని పెద్దగా అరుస్తూ విమానం అంతా పరుగులు మొదలుపెట్టింది. కాక్‌పిట్ డోర్ వద్దకు వెళ్లి దానిని బాదుతూ తనను దించేయాలంటూ కేకలు వేసింది. దాదాపు అరగంట పాటు నానా అల్లరీ చేయడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఆమెకు దుప్పటి కప్పి శాంతపరిచారు. చివరికి పైలట్లు విమానాన్ని దారి మళ్లించి, ఫ్లైట్ దించేసి ఆమెను హ్యూస్టన్ పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆమెను మానసిక వైద్యశాలకు తరలించారు. ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఆమె మతిస్థిమితం లేనిదని పోలీసులు తెలిపారు. ఈ కారణంగా విమానం గంటన్నర ఆలస్యంగా బయలుదేరింది.