ఊబర్ క్యాబ్‌లో మహిళకు చేదు అనుభవం-లింక్డ్‌ఇన్‌లో పోస్ట్
బెంగళూరులో ఊబర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న మహిళకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఈ విషయాన్ని లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేయగా, ఊబర్ వెంటనే స్పందించింది. బెంగళూరులోని బీఎటీఎం రెండవ స్టేజ్ నుండి జేపీ నగర్ మెట్రో వరకు క్యాబ్ బుక్ చేసిన ఆమె, బయలుదేరిన కాసేపటికే డ్రైవర్ రూటు మార్చడం గమనించింది. దీనికి తోడు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. దీనితో రైడ్‌ను ముందుగానే ముంగించాలని ఆమె ఊబర్ యాప్‌లో కంప్లైంట్ చేసింది. కారు ఆపించి, డబ్బు చెల్లించింది. అతను అతిచొరవతో అసభ్యంగా ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు వేయడానికి ప్రయత్నించడంతో, ఆమె ప్రతిఘటించింది. దీనితో ఆమెపై చేయి కూడా చేసుకున్నాడు. దీనితో ఆమె వెంటనే జనసంచారం ఉండేచోటుకు పరుగుతీసింది. తనకెదురైన చేదు అనుభవాన్ని లింక్డ్‌ఇన్‌లో కూడా పోస్టు చేసింది. ఈ పోస్టు వైరల్ కావడంతో ఊబర్ వెంటనే స్పందించి, ఆడ్రైవర్‌పై చర్య తీసుకుంది. ఆమె ఊబర్‌కు ధన్యవాదాలు తెలిపి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.

